RRR Trailer: ట్రైలర్ అంటే ఇలా ఉండాలి అనే రేంజ్ లో ఉంది ఈ మధ్య రిలీజ్ అయిన RRR ట్రైలర్. చూపించిన 2,3 నిమిషాల లోనే ప్రేక్షకుల మససుని ఆకట్టుకున్నారు.
RRR పేరు చిన్నదే అయిన ట్రైలర్ ఇచ్చిన ధమాకా చాలా పెద్దది. ట్రైలర్ చూస్తునంతసేపు అభిమానుల వొళ్ళు పులకరించి పోయింది. ఒక్క క్షణం కూడా కళ్ళు పక్కకు తిప్పకుండా చూసేలా అంత బాగా రూపొందించారు రాజమౌళి గారు.
రాజమౌళి గారు నిర్మించిన బాహుబలి చూసినపుడు ఇంత కన్నా మంచి సినిమా ఇంకా ఎవరు తియ్యలేరు అనుకున్నారు. కానీ RRR ట్రైలర్ చూసిన తరువాతే అనిపించేది ఏమిటంటే బాహుబలి కేవలం మొదటి మెట్టు మాత్రమే ఇక నుండి వచ్చే సినిమాలు హాలీవుడ్ రేంజ్ ను దాటి ఉంటాయి అని అనలేక ఉండలేరు రాజమౌళి నుండి.
మొత్తం సినిమాకి కీలక పాత్ర వహించేవి ఎమోషన్ మరియు పాత్రలో జీవించగలిగే తత్వం. ఈ రెండు NTR, రాంచరణ్ లు ఇరగదీశారు. సినిమాటోగ్రఫి విషయానికీ వస్తె హాలీవుడ్ లెవెల్ కి ఏమాత్రం తగ్గలేదు ఈ మూవీ లో. ఒక్కో ఫ్రేమ్ లో విజువల్స్ మాత్రం కనువిందు చేసేలా ఉన్నాయి అది రాజమళి దర్శకత్వం అంటే అనేలా ఉన్నాయి.
సినిమాలో అత్యంత ఆసక్తి కలిగించే విషయం NTR రాంచరణ్ ల కాంబినేషన్ అని చెప్పొచ్చు. RRR ట్రైలర్ లో ఇద్దరి పాత్రలు ప్రేక్షకుల మనసులో ముద్ర వేసేలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే రాంచరణ్ పాత్ర ని మొదట్లో కొంచెం నెగటివ్ లో చూపించడం జరిగింది. NTR రాంచరణ్ ల మద్యలో face off ఎవరు ఊహించ లేకపోయారు.
RRR ట్రైలర్ ని మొబైల్ ఫోన్ లో లేదా టీవి లాలో చూస్తేనే ఈ రేంజ్ లో ఉంది అంటే ఇక సినిమా థియేటర్ లలో చూస్తే ఒక్కొకరికి Goosebumps ఖాయం.
If you have any thoughts about this post, Please comment.