Vikram Vedha: ఈ మధ్య మన ఇండియా లో ఒక కొత్త ట్రెండ్ నడస్తోంది. ఇండియా లో ఎ సినిమా హిట్ అయిన ఆ సినిమా ని ఇతర భాషల లో రీమేక్ చేసేయడం. అయితే ఈ మధ్య నే హ్రితిక్ రోషన్ కూడా తమిళ్ లో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద సినిమా కి ఒప్పుకొని, ఆయన మొదటి లుక్ కూడా తన సోషల్ మీడియాలో తన పుట్టినరోజున విడుదల చేయడం జరిగింది.
ఈ సినిమా లో హ్రితిక్ రోషన్ విలన్ పాత్రలో ఒక గాంగ్ స్టర్ లుక్ లో కనిపిస్తున్నాడు. నెగటివ్ పాత్రలో ఊహించుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ రోషన్ అభిమానులు తెలియజేస్తున్నారు.
మంచి కిక్కు ఇచే క్రైమ్ మరియు థ్రిల్లర్ స్టోరీస్ ఎవరి కైనా నచ్చి తీరాల్సిందే.
కానీ ఇలా ఎపటి వరకు అనిపిస్తుంది అంటే, మనం ఈ రీమేక్ ని ఒరిజినల్ సినిమా తో పోల్చి చూడనంతవరకే. ఒరిజినల్ సినిమా లో విజయ్ సేతుపతి వేద పాత్రలో నటించారు. మన ఇండియాలో మంచి నటులలో ఆయన ఒకరు. వేద పాత్ర ఎలా ఉంటుంది అంటే తను ఒక ఈవిల్ జీనియస్ లాగా అనిపిస్తుంది. ఒక మనిషి ప్రాణాన్ని నవ్వుతూ తీస్తాడు అన్నమాట. కామెడీ ప్లస్ డేంజర్ మంచి ఊపు ఇచ్చే కలయిక ఉన్న పాత్ర.