రంగస్థలం సినిమా మార్చి 30/ 2018 లో విడుదల అయింది. ఈ చిత్రం అధికారికంగా ఫిబ్రవరి 2017 లో చిరంజీవి చేత ప్రారంభించబడింది. ఏప్రిల్ 2017 నుండి షూటింగ్ ప్రారంభమైంది, ఈ సినిమా ప్రపపంచవ్యాప్తంగా 210 కోట్ల రూపాయలు వసూల్ చేసింది.
చెల్లబోయిన చిట్టిబాబు (ramcharan) లారీ ప్రమాదానికి గురైన దక్షిణమూర్తి (ప్రకాష్ రాజ్ ) ని ఆసుపత్రి లో చేర్చి తన గతాన్ని గుర్తు చేసుకోవడంతో సినిమా మొదలవుతుంది.
చిట్టిబాబు రంగస్థలం గ్రామంలో వ్యవసాయపొలాలకు నీరు పెడుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు.
ఇతడికి వినికిడి సమస్య ఉంటుంది, ఎవరైనా గట్టిగా మాట్లాడితే
తప్ప వినబడదు.
తండ్రి కోటేశ్వరరావు (naresh) ఒక దర్జీ, తల్లి కాంతమ్మ(రోహిణి )
చెల్లి (యువి ) ఉంటారు.
తన అత్త కొల్లి రంగమ్మ ( అనసూయ ) ద్వారా పొలానికి నీరు పెట్టె మోటారును పొందుతాడు.
ఊరిలో తిరుగుతూ అందరిని యిబ్బంది పెడుతూ, ఒకసారి తనను కాటేసిన ఓ నల్ల త్రాచు పాము కోసం తిరుగుతూ ఉంటాడు.
తారగనం రాంచరణ్ సమంత ఆది ఫినిశెట్టి అనసూయ, పూజా హెగ్డే, జగపతి బాబు ప్రకాష్ రాజ్ అజయ్ ఘోష్ రాజీవ్ కనకలా, నరేష్.
- దర్శకత్వం సుకుమార్
- నిర్మాత వై నవీన్ వై రవిశంకర్ సి వి మోహన్
- సంగీతం దేవి శ్రీ ప్రసాద్
- ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ పాతాకం పైన నిర్మించారు.